WEIGHT LOSE OR GAIN MADE EASY సంప్రదించండి.ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మా సర్వీస్ అందించగలము. సంప్రదించండి నందకుమార్ 9010907404 .NONDAKUMAR,dharmavaram.9949941482,30days moneyback guarenty.

Tuesday, September 15, 2020

ఆరోగ్యకరమైన వయస్సు?

మీరు జీవించిన సంవత్సరాల సంఖ్య మీ కాలక్రమానుసారం, కానీ మీ జీవ యుగం శారీరక, మానసిక మరియు సామాజిక మార్పు యొక్క బహుళ డైమెన్షనల్ ప్రక్రియ, ఇది మీ ఆహారం మరియు జీవనశైలితో పాటు మీ జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది.పేలవమైన ఆహారం, నిశ్చల జీవనశైలి మరియు ఒత్తిడి కారణంగా వృద్ధాప్యం వేగంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు మీ జన్యువులను మార్చలేరు, కానీ మీ వయస్సును మీరు మార్చవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఒకే వయస్సులో ఉంటారు కానీ మానసిక మరియు శారీరక సామర్థ్యాలలో తేడా ఉంటుంది. ఇది ఒకేలాంటి కవలలకు కూడా వర్తిస్తుంది, వీరి జన్యువులు ఒకేలా ఉంటాయి -కానీ తేడాలు ఆహారం మరియు జీవనశైలి. బాగా వృద్ధాప్యం అనేది వృద్ధుల గురించి మాత్రమే కాదు-మెదడు కణాలు 23 ఏళ్ళ వయస్సు నుండే కోల్పోవడం ప్రారంభమవుతాయి.ఆరోగ్యకరమైన వృద్ధాప్యం యొక్క జీవనశైలిని ఇప్పటి నుండే ప్రారంభించండి!! ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో నిపుణులు అందరూ అంగీకరించే నాలుగు వ్యూహాలు: 1) ఆరోగ్యంగా తినండి; 2) శారీరకంగా చురుకుగా ఉండండి; 3) మానసికంగా చురుకుగా ఉండండి; 4) సామాజికంగా చురుకుగా ఉండండి.

Sunday, July 10, 2011

టీవీ చూస్తే వినోదం కాదు వ్యాధులొస్తాయి..?

మనం టీవీ ఎందుకు చూస్తాం. వినోదం కోసం. వార్తా విశేషాల కోసం. పిల్లలైతే కార్టూన్‌ షోలు, పిల్లల కార్యక్రమాలకు అంకితమవుతారు. ఇక మహిళలైతే గాలి లేకుండా బతగ్గలరు కానీ సీరియల్స్‌ లేకుండా ఉండలేరు. ఇది ప్రస్తుతమున్న పరిస్థితి. అందరికీ ఒక షాకింగ్‌ న్యూస్‌.. రోజూ రెండు గంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూస్తే టైప్‌-2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు వచ్చే ప్రమాదం అధికమని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు మూడు గంటలు కన్నా ఎక్కువ టీవీ చూస్తే అకాల మరణం సంభవిస్తుంది ! రెండు గంటల కన్నా ఎక్కువ టీవీ చూడడం వల్ల టైప్‌-2 మధుమేహం 20 శాతం, గుండె రక్తనాళాల జబ్బు 15 శాతం, అకాల మరణం 13 శాతం పెరుగుతుంది. ' ఇది సాధారణ సందేశం. టీవీ చూడడం తగ్గిస్తే టైప్‌-2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు, అకాల మరణాన్ని గణనీయంగా తగ్గించనట్లే' అని ప్రొఫెసర్‌ ఫ్రాంక్‌ హు తెలిపారు. ' మేం శారీరక కార్యకలాపాల స్థాయిని పెంచడాన్ని ప్రోత్సహించడమే కాక, స్థబ్దుగా ఉండే ప్రవర్తనను, ముఖ్యంగా ఎక్కువసేపు టీవీ చూడటాన్ని తగ్గించడానికి' ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ రోజూను మూడు భాగాలుగా విభజించారు. పని చేయడం, పడుకోవడం, టీవీ చూడడమని పరిశోధకులు తేల్చారు. యూరోపియన్లు, ఆస్ట్రేలియన్లు 3 నుంచి 4 గంటలు టీవీ చూడ్డానికి కేటాయిస్తుండగా, అమెరికన్లు ఏకంగా 5 గంటలు టీవీకి అతుక్కుపోతున్నారు. అమెరికాలో ప్రతి లక్ష మంది టీవీ చూడడం రోజుకు రెండు గంటలు మించితే కొత్తగా 176 టైప్‌-2 మధుమేహం, 38 గుండె రక్తనాళాల జబ్బులు, మరణానికి దారితీసే 104 కేసులు ఉంటాయని అంచనా వేశారు. టీవీ చూడడం వల్ల టైప్‌- 2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు, అకాల మరణానికి సంబంధమున్న అధ్యయనాలను ఫ్రాంక్‌ హు, అండెర్స్‌ గ్రంట్విడ్‌ విశ్లేషించారు. అధ్యయనాలు 1971 నుంచి 2011 మధ్య జరిగినవే. ' స్తబ్దుగా ఉండే జీవనశైలి అంటే ముఖ్యంగా ఎక్కువసేపు టీవీ చూడడం. టైప్‌-2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు రావడానికి ఇదో ప్రమాదకమైన కారణం' అని గ్రంట్విడ్‌ అంటారు. ఎక్కువ సమయం టీవీ చూడడం వల్ల పెద్దవారిలో టైప్‌- మధుమేహం వస్తుందని, అంతేకాక స్థూలకాయం వచ్చే అవకాశముందన్నారు. అందుకని రోజూ టీవీ చూడడం తగ్గించుకుంటే మేలు.

Friday, July 1, 2011

పిల్లల్లో ఊబకాయం

ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.

పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.

టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది.

టివిలోని వ్యాపార ప్రకటనలు రకరకాల తిళ్లవైపు పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. వాటన్నింటినీ అడిగారని కొనిపెట్టొద్దు. ఆటల పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి.

పిల్లల్లో టీవి చూసే అలవాటును తగ్గించడానికి అవసరమైతే తల్లిదండ్రులు కూడా టివిని చూడకుండా ఆపేయాలి.

కంప్యూటర్ గేమ్‌స్ ఆడుతూ కంప్యూటర్ స్క్రీన్ ముందర నుంచి పిల్లల ఒకపట్టాన కదలడం లేదు. ఎక్కువసేపు కంప్యూటర్ గేమ్‌స్‌కి అనుమతించొద్దు. అవసరమైతే కఠినంగా ఉండండి.

బడిలో, కమ్యూనిటీ ఆటల్లో పాల్గొనమని పిల్లల్ని ప్రోత్సహిస్తుండాలి. పిల్లలకు కొత్త కొత్త విషయాలు చెపుతుంటే రకరకాల ఆసక్తులు పెరుగుతాయి.

సూచనలు:

పిల్లలతో ఎక్కువసేపు గడిపేలా టైంని సర్దుబాటు చేసుకోవాలి.

పిల్లలతో వారితో ఆటలు ఆడడం. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి నేర్పాలి. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పిల్లలకి కూడా చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తుండాలి.

ఇంట్లో లావున్నపిల్లాడికి తక్కువ పెట్టడం, సన్నగా ఉండే పిల్లవాడికి ఎక్కువ పెట్టడం వంటి తేడాపాడాలు చూపకుండా అందరికీ ఒకేరకంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలి.

లావు తక్కువగా ఉండడం వల్ల, మంచి ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను పిల్లలకు అర్ధమయ్యేలా తరచూ చెపుతుండాలి. ఎప్పటికైనా ఈ మాటలు వారి బుర్రలో పడతాయి.

ఇది తిను. ఇది అస్సలు తినొద్దు అంటూ ఒక్క సారే పిల్లలపై ఒత్తిడి తేకుండా మెల్లగా పిల్లల్లోని అనారోగ్యపు అలవాట్లను పోగొట్టాలి. బెదిరించొద్దు. అలా చేస్తే మరింత మొండికెత్తుతారు. మెల్లగా చెప్పండి.

చాతీ వ్యాయామాలు

స్టెమిలిటీబాల్‌పై వన్ ఆర్మ్ బెంచ్ వర్కవుట్:

స్టెబిలిటీబాల్ మీద వెల్లకిలా పడుకోవాలి. బంతిపై మెడను స్ట్రెట్ పొజిషన్‌లో ఆనిచ్చి పెట్టాలి. నడుము కిందభాగం కొద్దిగా పైకి లేపి దానికి తగ్గట్టు శరీరాన్ని సమస్థితిలో వంచాలి. రెండు చేతులతో డంబెల్స్ పట్టుకోవాలి. ఒక చేయిని పైకి లేపి మెల్లగా దాని మోచేతిని చాతికి దగ్గరగా తీసుకుని వచ్చి డంబెల్‌తో ప్రెస్స్ చేయాలి. అలాగే రెండవ చేతితో కూడా చేయాలి.

పుషప్స్: స్టెమిలిటీ బాల్ మీద పిట్టను ఆనించి బోర్లా పడుకోవాలి. నేలపై అరచేతులు ఆనించాలి. మోచేతులను వంచుతూ శరీరాన్ని మెల్లగా కిందకిదించూతూ పుషప్స్ చేయాలి. ఇలా 10-15మార్లు రెండు లేదా మూడు సెట్లు చేయాలి.

మూలం: ఈనాడు

Sunday, March 21, 2010

మన ఆహారం-కేలరీలు

ఇది చూడండి

అన్నం 1 కప్ =170 కేలరీలు

పుల్కా 1 = 80 కే..

పరాటా = 150 కే..

పూరి చిన్నది =100 కే..

బ్రెడ్ 2 = 170...

ఉప్మా 1 కప్.=270...

ఇడ్లీ 2 చిన్నవి =150....

దోస 1 = 125...

కిచిడి 1 కప్ =200...

సాంబార్ 1 కప్ = 110...

కూర 1 కప్= 70...

గ్రుడ్డు 1 = 160...

మాంసం అర కప్పు= 270..

.కోడి అరకప్పు= 250...

చేప 1 ముక్క =70...

మసాలా వడ,దోస ,సమొసా = 200

ఇలానూ బరువు తగ్గొచ్చు!

ఏడాదయినా బరువు తగ్గాలనేది...చాలామంది కొత్త సంవత్సరం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. వ్యాయామాలు, రకరకాల థెరపీలు, చికిత్సలు ఎన్ని చేసినా బరువు పెరగడమే కాని తగ్గే ప్రశక్తి లేదా అంటూ వాపోయే వారికి ఓ శుభవార్త. ఇటలీ శాస్త్రవేత్తలు కార్బన్‌డైఆక్సైడ్‌తో బరువు తగ్గే ఉపాయం చెబుతున్నారు...అలా ఆశ్చర్యపోవద్దు. మీరు విన్నది నిజమే. పెద్ద పెద్ద చికిత్సలేం అవసరం లేకుండా కార్బన్‌డైఆక్సైడ్‌తోనే బరువు తగ్గడం సాధ్యం. అదీ ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో. ఇటలీలోని సియాన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం... మహిళల్లో ఊబకాయం భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు దారి తీయొచ్చు. మహిళల కొవ్వు కణజాలంపై ప్రత్యేకమైన కార్బన్‌డైఆక్సైడ్‌తో చేసిన ప్రయోగాలు అధిక బరువు సమస్యకు చెక్‌ పెడుతున్నాయి. చర్మంకింద, చుబుకం కింద, పొత్తికడుపు, పిరుదుల్లో పేరుకున్న కొవ్వును ఈ కార్బన్‌డైఆక్సైడ్‌ కరిగిస్తుంది. దీని వల్ల గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.sourse eenadu